Skip to content

Live From The Field

  • by
*రథసప్తమి  మహా తేజం…*
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి లో సూర్యదేవుని విశిష్టత..
 జనవరి నెల 24 వతేదీన 2018 రధసప్తమి (సూర్యజయంతి).
మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం *మొత్తం 12 మంది సూర్యులు.* 
ఏడాదిలోని *ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత* వహిస్తాడు. 
1. *చైత్ర మాసంలో* వచ్చే సూర్యుడి పేరు *‘ధాత’,* 
2. *వైశాఖంలో అర్యముడు,* 
3. *జ్యేష్టం-మిత్రుడు,* 
4. *ఆషాఢం-వరుణుడు,* 
5. *శ్రావణంలో ఇంద్రుడు,* 
6. *భాద్రపదం-వివస్వంతుడు,* 
7. *ఆశ్వయుజం-త్వష్ణ,* 
8. *కార్తీకం-విష్ణువు,* 
9. *మార్గశిరం- అంశుమంతుడు,* 
10. *పుష్యం-భగుడు,* 
11. *మాఘం-పూషుడు,* 
12. *ఫాల్గుణం-పర్జజన్యుడు.* 
ఆ నెలల్లో *సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు* వచ్చాయని చెబుతారు. 
*భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు.*  
బాల్యంలో హనుమంతుడు సూర్యుణ్ణి పండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట. అందుకోసం *హనుమ వెళ్లిన దూరాన్ని ‘యుగ సహస్ర యోజన పరాభాను’ అని తులసీదాస్‌ హనుమాన్‌ చాలీసాలో చెబుతారు.* 
దీన్ని లెక్క కడితే… ‘యుగం.. 12000 ఏళ్లు, సహస్రం.. 1000, యోజనం.. 8 మైళ్లు, మైలు… 1.6 కిలోమీటర్లు వెరసి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది *ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది.* 
సూర్యకాంతి *ఏడు వర్ణాల కలయిక* అని వైజ్ఞానికులు చెబుతుంటే, 
ఆయన *ఏడు గుర్రాలున్న రథం* మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది. 
ఆ ఏడు గుర్రాల పేర్లు 
1. *గాయత్రి,* 
2. *త్రిష్ణుప్పు,* 
3. *అనుష్టుప్పు,* 
4. *జగతి,* 
5. *పంక్తి,* 
6. *బృహతి,* 
7. *ఉష్ణిక్కు…* 
*వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి* పోలుతాయి. 
రామరావణ యుద్ధం సమయంలో అలసిపోయిన *శ్రీరాముడికి అగస్త్య మహాముని ‘ఆదిత్య హృదయం’ ఉపదేశించినట్లు* రామాయణంలో ఉంది. 
ఇందులో 30 శ్లోకాలున్నాయి. వీటి *స్మరణ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు.* 
*సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు, రాత్రికి ప్రతీక అని, చక్రాలకున్న ఆరు ఆకులు రుతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది.* 
అందుకే *సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి* అని పిలుస్తారు.

Related Images:

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x